ఎంపానల్‌కు దరఖాస్తుల స్వీకరణ

మీడియేటర్లుగా ఎంపానల్‌

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

మీడియేటర్లుగా ఎంపానల్‌ కావడానికి విశ్రాంత న్యాయాధికారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అనుబంధంగా మధ్యవర్తులుగా ఎంపానల్‌ కావడానికి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తులను అందజేస్తే, వాటిని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

➡️