మోడల్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో

మోడల్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తున్న ఆర్‌ఐఒ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం

భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈనెల 17, 18, 19 తేదీల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌ ఫలితాలు సోమవారం ఆర్‌ఐఒ పి.దుర్గారావు ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ అంటే విద్యార్థుల కోసం పోరాటాలు, ఉద్యమాలు మాత్రమే కాకుండా వారికి పరీక్షలు అంటే భయం పోగొట్టే వాళ్లని, భవిష్యత్‌ పరీక్షలకు ఈ మోడల్‌ ఎంసెట్‌ ఒక ప్రామాణికంగా ఉంటుందన్నారు. అలాగే విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీసి వారిలో సృజనాత్మకత శక్తిని పెంపొందించే దిశలో ఎస్‌ఎఫ్‌ఐ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,500 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, దీనివలన వారు భవిష్యత్‌లో రాయబోయే ఎంసెట్‌కు ఇది ఒక ప్రామాణికంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.చందు, గర్ల్స్‌ కన్వీనర్‌ రేవతి పాల్గొన్నారు.

 

➡️