రాజకీయ క్రీడలో బలిపశువులం

రాజకీయ క్రీడలో అటు ప్రజా ప్రతినిధులు, ఇటు రెవెన్యూ

దీక్షలో పాల్గొన్న బెంతొరియా ప్రతినిధులు

కవిటి:

రాజకీయ క్రీడలో అటు ప్రజా ప్రతినిధులు, ఇటు రెవెన్యూ అధికారుల తీరుతో గత 20 ఏళ్లుగా మోసపోతూనే ఉన్నామని బెంతు ఒరియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ మండల కేంద్రంలోని బెంతొరియాలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 144వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో తరగతి, ఉప తరగతి పేరుతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ ధ్రువపత్రం జారీ చేయకపోవడంతో బెంతొరియా విద్యార్థులు ఉపాధి, ఉన్నత చదువులు కోల్పోతున్నారని అన్నారు. తమ బిడ్డలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ (జగనన్న విద్యా దీవెన) మంజూరు కావడం లేదని, ఎపి ఉన్నత విద్యా మండలి నిర్వహించే ప్రవేశ పరిక్షల కౌన్సెలింగ్‌లో తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంతో అనేక మంది బెంతొరియా విద్యార్థులు చదువుకి దూరమవుతున్నారని అన్నారు. మరోవైపు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తూ ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ పార్టీలు ఓట్లు వెయ్యించుకుని తమను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇకనైనా స్పందించకపోతే తమ పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 

➡️