ఆర్‌బికెల ద్వారా విత్తనాలు, ఎరువులు

రైతుభరోసా

మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జెడి శ్రీధర్‌

  • వ్యవసాయశాఖ జెడి శ్రీధర్‌

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

రైతుభరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించనున్నట్లు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీఫ్‌ కార్యాచరణపై స్థానిక రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకులు, రైతులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన అన్ని సేవలు రైతుభరోసా కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఖరీఫ్‌ పంట కాలానికి కావాల్సిన పచ్చిరొట్ట, వరి విత్తనాలు జూన్‌ మొదటి వారంలో రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు స్థానిక రైతుభరోసా కేంద్రాల్లో ముందుగానే నిల్వ చేసుకోవాలని వ్యవసాయ సహాయకులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ సహ సంచాలకులు భవానీ శంకర్‌, జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్‌ పి.బాలకృష్ణ, మండల వ్యవసాయాధికారి ఎస్‌.గోవిందరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

➡️