సేవాతత్పరుడు హారికా ప్రసాద్‌

హారికా కనస్ట్రక్షన్స్‌ అధినేత, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హర్షవల్లి వ్యవస్థాపక

అన్నదానం చేస్తున్న హారికా ప్రసాద్‌ కుటుంబసభ్యులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

హారికా కనస్ట్రక్షన్స్‌ అధినేత, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కెఎన్‌ ఎస్‌వి ప్రసాద్‌ (హారికా ప్రసాద్‌) సేవాతత్పరుడని, సమాజహితం కోరుకునే వ్యక్తిత్వం కలిగిన వారని లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హర్షవల్లి అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథనాయుడు అన్నారు. హారికాప్రసాద్‌ పుట్టినరోజును పురష్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో సత్యసాయి అన్నపూర్ణ సత్రంలో సుమారు 400 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథనాయుడు మాట్లాడుతూ సమస్త మానవాళికి సేవాగుణం అలవర్చిన గొప్ప మహోన్నత వ్యక్తి సత్యసాయి బాబా అని, ఆయనను స్మరించుకుంటూ అన్నదానం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హర్షవల్లి ఆధ్వర్యంలో హంగరీ ఫీడింగ్‌ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లో హారికా ప్రసాద్‌ స్వగృహంలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, కార్యాలయ సిబ్బంది సమక్షంలో కేకు కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన భార్య, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హర్షవల్లి జోనల్‌ చైర్మన్‌ కరణం శోభారాణి, డాక్టర్‌ చింతాడ కృష్ణమోహన్‌, తర్లాడ అప్పలనాయుడు, మణిశర్మ, డాక్టర్‌ సత్యస్వరూప్‌, జెఎన్‌టి నాయుడు, లక్ష్మణ్‌, సుమన్‌, కృష్ణ, నిహార్‌ నాయుడు, స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్షులు శాసపు జోగినాయుడు, కార్యాలయ మేనేజర్‌ రాఘవ కుమార్‌, ప్రదీప్‌, సాగర్‌, అనీల్‌, తిరుపతి, ప్రసన్న, నిరంజన్‌, రాజు, భార్గవ్‌, హారిక, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, తులసి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️