త్వరితగతిన సిఎస్‌పి రోడ్డు పనులు

శ్రీకాకుళం-ఆమదాలవలస

పుష్పగుచ్ఛం అందజేస్తున్న రవికుమార్‌

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ప్రజాశక్తి – ఆమదాలవలస

శ్రీకాకుళం-ఆమదాలవలస సిఎస్‌పి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. అమరావతిలో ఆర్‌అండ్‌బి మంత్రి బి.సి జనార్థన్‌ రెడ్డిని గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎస్‌పి రహదారి దుస్థితిని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ రహదారి అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేసినా, తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో పనులు పూర్తికాక నిలిచిపోయాయని చెప్పారు. గత ఐదేళ్లలో ఈ రహదారిపై పలు ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడ్డారని తెలిపారు. తక్షణమే ఈ రహదారి పూర్తికి సహకరించాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి రహదారి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సంబంధిత రహదారి కాంట్రాక్టర్‌తో రవికుమార్‌ ఫోన్‌లో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, బిల్లులు సకాలంలో అందేలా తాను బాధ్యత తీసుకుంటానని భరోసానిచ్చారు.

➡️