నేటి నుంచి వేసవి సెలవులు

విద్యాశాఖ ఆదేశాల మేరకు

ప్రజాశక్తి – టెక్కలి

విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు నేటి నుంచి మూతపడనున్నాయి. ఈనెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 12న పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. సుమారు 50 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సెలవుల నేపథ్యంలో పిల్లలు ఊర్లు వెళ్లేందుకు, ఎంజారు చేసేందుకు రెడీ అవుతున్నారు. పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడి.. ట్రిప్స్‌ వేసేందుకు తల్లిదండ్రులకు వెళ్లాల్సిన ప్రాంతాల జాబితాను చెప్తున్నారు.వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి క్లాసుల వారీగా అమలు చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలను వెలువరించింది. ‘సెలవుల్లో సరదాగా-2024’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం కోచింగ్‌ క్యాంపులు నిర్వహించాలని పిఇటిలకు సూచించింది. విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉరు లవ్‌ రీడింగ్‌ పేరిట కాంపిటీషన్‌ నిర్వహించాలని సూచించింది. విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యాలతో పాటుగా క్రీడలు, వృత్తి నైపుణ్యం, సజనాత్మక కళలపై ఫోకస్‌ పెట్టాలని పేర్కొంది. విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక కమ్యూనిటీలు కూడా ఇందులో పాల్గొనాలని సూచించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే చేరేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

➡️