సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

సమగ్రమైన ప్రాథమిక

మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

  • జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమగ్రమైన ప్రాథమిక విద్యనందించడం ద్వారా సమాజ నిర్మాణానికి మంచి బాటలు వేయొచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని పెద్దపాడు సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యనందించే ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు అకడమిక్‌ శిక్షణా తరగతులను గురురవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య వ్యవస్థకు పునాది వంటిదని, సమర్థవంతంగా ఈ విద్యనందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. రెెండు రోజుల శిక్షణలో చిత్త శుద్ధితో మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. 1, 2 తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితంలో అందిస్తున్న విద్యలో మెలకువలను నేర్చుకోవాలన్నారు. జ్ఞానప్రకాష్‌ – 60 రోజుల శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని 30 మండలాల నుంచి 90మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వారికి గణితం, భాషకు సంబంధించిన పలు అంశాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. ఈ తరగతులకు సమగ్ర శిక్ష అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి గుంట లక్ష్మీనారాయణ కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నరసన్నపేట, పాతపట్నం ఎంఇఒలు దాలినాయుడు, తిరుమలరావు, సమగ్ర శిక్ష సెక్టోరల్‌ అధికారులు ప్రభాకరరావు, నళినీకాంత్‌ పరిశీలకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రథం జిల్లా కో-ఆర్డినేటర్‌ మురళీమోహన్‌, లీలామోహన్‌, అరుణ కుమారి, శివాజీ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️