రాష్ట్రాన్ని నిలబెట్టాలి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి

ప్రచారం చేస్తున్న రవికుమార్‌

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి రాష్ట్రాన్ని నిలబెట్టాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దపాలెం, పాలవలస, రావివలస, పెద్ద వెంకటాపురం, వీరమల్లిపేట, సింధువాడ, పెద్ద సవలాపురం, మూల సవలాపురం, తురకపేట, కొండ్రగూడెం, కొత్తకోట గ్రామాల్లో టిడిపి శంఖారావం కార్యక్రమంలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో రవికుమార్‌ మాట్లాడుతూ వైసిపి చేతకాని పాలనతో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన జగన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులన్నీ తాకట్టు పెట్టి పరిపాలన సాగిస్తాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కుతాడని ప్రజలకు వివరించారు. విజ్ఞులైన ఓటర్లు రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో వైసిపిని తరిమికొట్టి ప్రజా ప్రభుత్వమైన టిడిపిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పేడాడ సూరపు నాయుడు, అంబల్ల రాంబాబు, కిల్లి సిద్ధార్థ, పల్లి సురేష్‌, తల్లాడ సురేంద్ర, సురవరపు జగదీష్‌, తాడేల రాజారావు, గురువు తిరుమలరావు, లావేటి పూర్ణారావు, మీసాల రామారావు పాల్గొన్నారు.

 

➡️