పోర్టు పనులకు నీళ్లు అమ్ముకుంటున్నారు

సంతబొమ్మాళి మండలం

పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతున్న మహిళలు

  • పంచాయతీ కార్యాలయం వద్ద యామాలపేట గ్రాస్తుల ఆందోళన

ప్రజాశక్తి – నౌపడ

సంతబొమ్మాళి మండలం యామాలపేటలో తాగునీటి కష్టాలతో మహిళలు, యువకులు గురువారం నిరసనకు దిగారు. యామాలపేటలోని పలు వ్యవసాయ మోటారు పంపుల ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులు మూలపేట పోర్టు పనులకు నీళ్లు అమ్ముకోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతు న్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ ప్రతినిధి ముదిలి సంజీవ్‌ ఆధ్వర్యాన పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి గ్రామంలో ఎక్కడపడితే అక్కడ బోర్లు తవ్వకాలు చేపట్టారని తద్వారా పోర్టు పనులకు, ప్రైవేటు కార్యక్రమాలకు అధిక మొత్తంలో నీటిని అమ్ముకుంటున్నా అధికారులు పట్టించు కోవడం లేదని విమర్శించారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామంలో తాగునీటి సరఫరా చేసే వాటర్‌ ట్యాంకుకు నీరు సరిగ్గా అందడం లేదన్నారు. దీంతో రెండు మూడు రోజులు తాగునీరందక ఇబ్బందులు పడుతున్నామ ని చెప్పారు. గ్రామంలోని ఇళ్లల్లో బోర్లకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని సక్రమంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించక పోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కేశవరావు స్పందిస్తూ గ్రామస్తుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని ఎంపిడిఒ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈనెల 12న గ్రామసభ నిర్వహించి, ఆయా బోర్ల యజమానులతో మాట్లాడి నీటి అక్రమ తరలింపు చర్యలను నిలుపుదల చేస్తామన్నారు

 

.

➡️