సాగుకు సమాయత్తం

నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి

అంపోలులోని విత్తన ప్రాసెస్‌, నిల్వ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెడి శ్రీధర్‌

ఈ ఖరీఫ్‌లో 4,21,655 ఎకరాల్లో వరి సాగు

38,882 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ

జూన్‌ మొదటి వారంలో అందజేతకు ఏర్పాట్లు

పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తుండడంతో, అందుకనుగుణంగా రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. చాలాచోట్ల వేసవి దుక్కులు ఇప్పటికే పూర్తయ్యాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. పంటల సాగు, విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రయివేట్‌ వ్యాపారులూ విత్తనాల విక్రయాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏటా 33 శాతం రాయితీపై వరి విత్తనాలు సమకూర్చుతోంది. గతేడాది మాదిరిగానే ఉత్తరాంధ్రకు జిల్లాలకు వరి రకం విత్తనాలపై 46 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.జిల్లాలో ఈ ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,21,655 ఎకరాల్లో వేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో 3,87,322.5 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా వేశారు. సజ్జలు 127.5 ఎకరాల్లో సాగు ఉండొచ్చని అధికారులు అంచనాలు రూపొందించారు. మొక్కజొన్న 25,270 ఎకరాలు, రాగులు 92.5 ఎకరాలు వేయనున్నారు. పప్పు ధాన్యాలకు సంబంధించి కంది 230 ఎకరాల్లో, పెసర 137.5, మినప పంట 172.5 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. వేరుశనగ 730 ఎకరాల్లో, నువ్వులు 57.5 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తున్నారు. పత్తి 3,887.5 ఎకరాల్లో, గోగు పంట 142.5 ఎకరాల్లో సాగు చేయనున్నారు. చెరకు 3,485 ఎకరాల మేర సాగయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. 38,882 క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలుప్రస్తుత ఖరీఫ్‌కు అన్నిరకాల విత్తనాలు కలిపి 38,882 క్వింటాళ్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో సాధారణ రైతుల అవసరాల కోసం 36,662 క్వింటాళ్లు, ఎస్‌సి, ఎస్‌టి రైతులకు 90 శాతం సబ్సిడీపై అందించేందుకు 2,220 క్వింటాళ్లను కేటాయించారు. వరి రకానికి సంబంధించి 36,420 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో సాధారణ రాయితీ అందించేందుకు 34,200 క్వింటాళ్లు, 90 శాతం రాయితీపై అందించేందుకు 2,220 క్వింటాళ్లు అవసరమని గుర్తించారు. జిల్లాలో ఈ ఏడాది ఎంటియు 1061 రకం సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రకం విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ 9,903 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపింది. స్వర్ణ రకం విత్తనాలు 7,433 క్వింటాళ్లు కావాలని ప్రతిపాదనలు పంపారు.50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడంతో భూసారం క్రమేణా దెబ్బతింటోంది. భూమిలో సేంద్రియ పదార్థం దెబ్బతిని, నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు వేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఖరీఫ్‌లో 1540 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో కట్టెజనుము 516 క్వింటాళ్లు, జీలుగ 1020 క్వింటాళ్లతో పాటు పిల్లిపెసర నాలుగు క్వింటాళ్లను 50 శాతం రాయితీపై అందించనున్నారు. పది కేజీల ప్యాకెట్‌ రూ.880 కాగా, రూ.440కే అందిస్తున్నారు. జూన్‌ మొదటి వారంలో విత్తనాల పంపిణీఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. పచ్చిరొట్ట వితనాల పంపిణీని ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభించాం. రైతుభరోసా కేంద్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా వరి, ఇతర రకాల విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. విత్తనాల కోసం ఈనెల 22వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తాం. ఇప్పటికే 16 వేల క్వింటాళ్ల విత్తనాలను పలు వ్యవసాయ సబ్‌ డివిజన్లకు తరలించాం. జూన్‌ మొదటి వారంలో వరి విత్తనాలు పంపిణీ చేస్తాం. – కె.శ్రీధర్‌, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులుఅధికారులు పంపిన వరి విత్తన రకాల ప్రతిపాదనలువరి విత్తన రకం ప్రతిపాదనలు (క్వింటాళ్లలో)ఎంటియు 1061 9,903(ఇంద్ర)ఎంటియు 1064 3,272.6(అమర్‌)ఎంటియు 1121 7,683.5(శ్రీధృతి)ఎంటియు 7029 3,993(స్వర్ణ)ఎంటియు 1318 1015ఆర్‌జిఎల్‌ 2537 2,661శ్రీకాకుళం సన్నాలు 760(బిపిటి 3291)సోనామసూరి 4,744.5(బిపిటి 5204) సాంబమసూరి 2387.4(ఎంటియు 1224)

 

➡️