నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

నగరంలోని ఆర్ట్స్‌

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెసి నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. ఆయుష్‌, ఎన్‌వైకె సంయుక్తంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగా శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఆయుష్‌ సీనియర్‌ వైద్యాధికారి పి.జగదీష్‌ మాట్లాడుతూ యోగాపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఆయుష్‌ శాఖ ఆధ్వర్యాన పోస్టర్లు, స్టిక్కర్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తొలుత యోగా డే పోస్టర్‌ను డిఆర్‌ఒ గణపతిరావుతో కలిసి జెసి ఆవిష్కరించారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఎపిసి రోణంకి జయప్రకాష్‌, జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు, సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా నమన్వయకర్త వెంకట్‌ ఉజ్వల్‌, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ శ్రీధర్‌ శ్రీధర్‌, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

➡️