‘సూపర్‌ సిక్స్‌’పై అవగాహన

ఒక్క అవకాశాన్ని కల్పించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని

పాతపట్నం : ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న గోవిందరావు

ప్రజాశక్తి- పాతపట్నం

ఒక్క అవకాశాన్ని కల్పించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు హిరమండలం మండల కేంద్రంలో ఇంటింటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సలాన శరత్‌ కుమార్‌, దుక్క శ్రీకాంత్‌ రెడ్డి, అమర చిరంజీవి, హిరమండలం టిడిపి అధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు, పోతురాజు శ్రీథర్‌ పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్‌ : నగరంలోని కంపోస్టు కాలనీలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నక్క శంకరరావు, వి.శ్రీనివాసరావు, రవీంద్రకుమార్‌, దేశల్ల రామారావు, కరకవలస శరత్‌బాబు పాల్గొన్నారు. కోటబొమ్మాళి: సామాజిక పింఛను ప్రతినెలా 1న వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఉదయానే ఇచ్చావారని, అలా ఇవ్వకుండా పింఛనుదారులను సచివాలయాలకు వెళ్లి అక్కడ గంటల తరబడి లైన్‌లో నిలుచోని పింఛను తీసుకుంటున్నారని, దీనికి కారణం చంద్రబాబేనని ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరావు, వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు నూక సత్యరాజు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళిలు ఆరోపించారు. మండలంలోని చిట్టేవలస, వింజాంపాడు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కళింగ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, సచివాలయ కన్వీనర్‌ గడ్డవలస నాగభూషణరావు, వైస్‌ ఎంపిపి దుక్క రోజా, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

 

➡️