స్టేట్‌ హోం సందర్శన

మహిళలు స్వయం సవృద్ధి సాధించడానికి శ్రీశక్తి

పరిశీలిస్తున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మహిళలు స్వయం సవృద్ధి సాధించడానికి శ్రీశక్తి సదన్‌, స్టేట్‌ హోంలు దోహద పడతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌. సన్యాస ినాయుడు అన్నారు. శుక్రవారం ఐసిపిఎస్‌ అధికారి కె.వి.రమణతో కలిసి ఆయన సదన్‌, స్టేట్‌హోంలను సంద ర్శించారు. అక్కడ మహిళల సంరక్షణ, అందిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న శిక్షణను ఆయన పరిశీలించారు. సౌకర్యాలలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా మేనేజర్‌ పార్వతిని ఆదేశించారు. అలాగే అంపోలులోని జిల్లా కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచనతో ఆయన సందర్శించారు. కారాగారంలో ఖైదీలకు అందుతున్న వసతులను వ్యక్తిగతంగా పర్యవేక్షించి ఖైదీలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఖైదీల్లో ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకొనే ఆర్థిక స్తోమత లేకపోతే లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం ద్వారా ఖైదీల కేసులు ఉచితంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చేయిస్తుందని తెలిపారు. డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ కె.వి.రమణ, జైలర్లు ఉదయ భాస్కర్‌, దివాకర్‌ నాయుడు, ముద్దాయిలు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.రికార్డులను

➡️