మా గ్రామం నీరు.. మా అవసరాలకే

Apr 12,2024 13:07 #srikakulam
  • పోర్టు పనులకు నీరు తరలించకుండా కట్టడి చర్యలు
    యామల పేట గ్రామస్తుల తీర్మానం

ప్రజాశక్తి-నౌపడ : సంతబొమ్మాలి మండలం యామల పేట గ్రామస్తులు గ్రామంలోని వ్యవసాయ బోర్లలో ఉన్న నీటిని, భూగర్భ జలాలను తమ గ్రామ అవసరాలకే వాడుకుంటామని శుక్రవారం గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ప్రతినిధి ముదిలి సంజీవ్, పంచాయతీ కార్యదర్శి కేశవరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని వ్యవసాయ నిమిత్తం వేసిన బోర్లనుంచి మూలపేట పోర్టుకు, ఇతర కార్యక్రమాలకు అమ్ముకోకుండా నిబంధనలు విధిస్తూ తీర్మానించారు. తమ గ్రామ సమీపంలో ఎన్నో ఏళ్లగా ఉన్న ఎన్ఎస్ కంపెనీలో గ్రామస్తులు 200 మంది వరకు ఉపాధి పొందడంతో ఆ కంపెనీకి మినహాయించి వేరే ఇతర కార్యక్రమాలకు నీటిని తరలించకూడదని నిర్ణయించారు. కాగా ఈనెల 11వ తేదీన గ్రామంలోని బోర్ల ద్వారా తాగునీరు బయట గ్రామాలకు తరలింపును వ్యతిరేకిస్తూ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు, యువత నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భూగర్భ జలాలు అందక గ్రామంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని గుర్తించిన గ్రామస్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎంపీడీవోకు పంపిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ సర్పంచ్ జగన్నాధ రావు, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మధు, మోహన్ రావు, ఎల్ రామిరెడ్డి, జి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️