ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం

ఎన్నికల సమయంలో పింఛను పెంపుతో పాటు ఏప్రిల్‌ నుం

వృద్ధునికి పింఛన్‌ను అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

ఎన్నికల సమయంలో పింఛను పెంపుతో పాటు ఏప్రిల్‌ నుంచి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్‌టిఆర్‌ భరోసా ద్వారా పేదల కళ్లల్లో ఆనందం నింపేలా పండగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. మండలంలోని వాండ్రాడలో, తర్లిపేట పంచాయతీలో వృద్దులకు, వికలాంగులకు మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర రవాణశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి సోమవారం పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, వారి జీవన ప్రమాణాల పెంపునకు తొలి అడుగు పడిందన్నారు. పింఛన్ల పెంపుతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపి స్తోందని చెప్పారు. ఆర్థిక అసమానతల్లేని సమాజం చూడాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. ఒకే రోజు తొలి రెండు గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తుందని తెలిపారు. జగన్‌ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలే అందవని వైసిపి నాయకులు ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు అంతకు రెట్టింపు సంక్షేమం అందుతుందన్నారు. గత పాలకులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ తమవల్ల కాదన్నారని, పంపిణీ చేతకాకపోతే దిగిపోవాలని, తాము చేసి చూపిస్తామని ఆనాడే చెప్పామన్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లు అందించగలిగామని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్‌, మాజీ ఎంపిపి వెలమల విజయలక్ష్మి, టిడిపి మండల అధ్యక్షులు బోయిన రమేష్‌, వి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పింఛన్లతో ఆర్థిక భరోసా : కలెక్టర్‌రణస్థలం, శ్రీకాకుళం రూరల్‌ : వృద్ధులు, వితంతు వులు, వికలాంగులు ఎవరిపై ఆధారపడకుండా జీవించడానికి ఎన్టీఆర్‌ భరోసా పథకం దోహదపడు తుందని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు, రణస్థలం మండలంలోని జె.ఆర్‌ పురం పంచాయతీ లో ఆయన పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో పింఛన్ల రూపంలో రూ.93.30 కోట్లు పంపిణీ చేయగా, ప్రస్తుతం 3,19,119 మందికి రూ.211.69 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య, కూటమి నాయకులు డి.జి.ఎం ఆనందరావు, డి.శ్రీనివాసరావు, డి.ఉదరు కుమార్‌, ఎ.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

➡️