టిడిపి అభ్యర్థిని అడ్డగించిన వైసిపి నేతలు

మండలంలో ఇప్పిలి గ్రామంలో వైసిపికి అనుకూలంగా ఏకపక్షంగా

రోడ్డుపై బైఠాయించిన శంకర్‌

రోడ్డుపై బైఠాయించిన శంకర్‌ 

పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం

ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌

మండలంలో ఇప్పిలి గ్రామంలో వైసిపికి అనుకూలంగా ఏకపక్షంగా ఓటింగ్‌ జరుగుతున్నట్టు తెలియడంతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ ఇప్పిలి పంచాయితీ పరిధిలో పోలింగ్‌ సరళిని పరిశీలిం చేందుకు వెళ్తుండడంతో వైసిపి కార్యకర్తలు అడ్డగించారు. గ్రామంలోకి వెళ్ళనీయకుండా వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో శంకర్‌ వర్గీయలు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో శంకర్‌ వారి తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ వైసిపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రౌడీయిజం చేస్తుందని, పోలింగ్‌ రోజున పోటీలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. వైసిపి అరాచక పాలనకు మరెన్నో రోజులు గడువు లేదన్నారు. పోలీసులు సైతం వైసిపికి అనకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకుని నచ్చజెప్పడంతో వివాదం సద్దు మణిగింది.

 

➡️