యువత ఓటింగ్‌లో పాల్గొనాలి

యువత అధిక సంఖ్యలో

బహుమతిని అందజేస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ పిలుపునిచ్చారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘అందరూ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనాలి’ అంశంపై వీడియో, పోస్టర్‌ రూపకల్పనకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వీడియో తయారీలో ప్రథమ బహుమతి రణస్థలం మండలానికి చెందిన రమణారావుకు రూ.ఐదు వేలు, బూర్జ మండలం పాలవలసకు చెందిన జల్లు విశ్వేశ్వరరావు, శ్రీకాకుళం మండలం పి.రోహిత్‌కు ద్వితీయ బహుమతి రూ.మూడు వేలు చొప్పున, సనపల రిషి, దామోదర సురేష్‌, జక్కుల పద్మశ్రీకి రూ.రెండు వేలు చొప్పున తృతీయ బహుమతి, మెమోంటో, సర్టిఫికెట్లు అందజేశారు. పోస్టర్‌ రూపకల్పనలో ప్రథమ బహుమతి బల్లెడ లక్ష్మీసహనకు రూ.మూడు వేలు, రేగులపాటి పునీత్‌కు ద్వితీయ బహుమతి రూ.రెండు వేలు, కావలి కవిత, కొత్తకోట హాసినికి రూ.వెయ్యి చొప్పున తృతీయ బహుమతి అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, హౌసింగ్‌ పీడీ గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️