నగరంలో శ్రీలీల సందడి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ నగరంలో ప్రముఖ సినీనటి శ్రీలీల సందడి చేశారు. శుక్రవారం నగరంలో కొత్తగా తీర్చిదిద్దిన కళ్యాణ్‌ జ్యువెలరీ షోరూం ప్రార ంబోత్సవానికి ఆమె విచ్చేశారు. ఆమె చూసే ందుకు యువత మండుటెండను కూడా లెక్కల చేయకుండా జగనం పడిగాపులు కాశారు. యువత కోరిక మేరకు శ్రీలీల స్టేజిమీద చిన్న స్టెప్‌ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఆకర్షణీయమైన ఆభరణాల కలెక్షన్‌తో ఆభరణాల ప్రేమికులను ఆకట్టుకుందని చెప్పారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు ఆభరణాలను అం దించే సమగ్ర వ్యవస్థను అం దుబాటులోకి తేవడం హర్షనీ యమని తెలిపారు. కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కళ్యాణ్‌ రామన్‌ మాట్లా డుతూ విని యోగదారుల అవ సరాలకు అనుగుణంగా ఆభర ణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారులకు విస్తృతమైన ఆఫర్లు అంది స్తున్నామని తెలిపారు. తాము విక్రయించే ఆభరణాలన్ని బిఐఎస్‌ హాల్‌ మార్క్‌ కలిగి ఉంటాయని చెప్పారు. ఎక్సైంజ్‌, బై-బ్యాక్‌ విధానాలను సంస్థ అమలు చేస్తుందన్నారు.

➡️