పింఛనుదారులకు అండగా నిలవండి : కోలగట్ల

Apr 30,2024 21:57

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  వైసిపి నాయకులు, కార్యకర్తలు, మాజీ వాలంటీర్లు పింఛందారులకు అండగా నిలవాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులు బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ తిరగకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి సంబంధిత నగదును వారికి అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారమే పరమావధిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్‌ వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు అదే వాలంటీర్లకు తాను అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు తాజాగా 6 గ్యారంటీలు అంటూ ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. కేవలం ఎన్నికల్లో రాజకీయాలకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదన్నద్ణిదని ప్రశ్నించారు.అధికారం కోసం కూటమి పేరిట చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాలను ప్రజలను ప్రజలు తీపి కొట్టాలని అన్నారు. సమావేశంలో వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేటర్‌ గుజ్జల నారాయణరావు, జోనల్‌ ఇన్చార్జిలు పాల్గొన్నారు.

➡️