బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు : ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ

ప్రజాశక్తి -నెల్లూరు : నగర పాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందజేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ హెచ్చరించారు. మంగళవారం పరమేశ్వరి నగర్‌, వాకర్స్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భం గా డాక్టర్‌ వెంకట రమణ మాట్లాడుతూ … వ్యాపార వాణిజ్య ప్రాంగణాలలో చెత్త బుట్టలను తప్పనిసరిగా వినియోగించాలని, వాటిపై నగర పాలక సంస్థ కేటాయించిన లోగో స్టిక్కర్‌ ను అతికించాలని సూచించారు. డ్రైను కాలువల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను వేయడం వల్ల మురుగు నీటి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతాయని, ప్రతిఒక్కరూ క్రమశిక్షణగా చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని సూచించారు. అనంతరం స్థానిక డివిజన్‌ లో జరుగుతున్న దోమల నివారణా చర్యల్లో భాగమైన ఫాగింగ్‌, మందు పిచికారీ, డ్రైను కాలువల పూడికతీత పనులను డాక్టర్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రధాన రోడ్లమీద వాహనదారులకు ఇబ్బందిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలిస్తామని డాక్టర్‌ వెంకటరమణ హెచ్చరించారు. పశువులను గోశాలకు తరలించే స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా స్థానిక పరమేశ్వరి నగర్‌ ప్రాంతంలో సంచరిస్తున్న పశువులను కల్లూరుపల్లి గోశాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. వాహన ప్రమాదాలకు కారణమవుతు న్న పశువులు యధేచ్చగా రోడ్లపై సంచరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ బోమని ఆయన స్పష్టం చేశారు. పశువులను గోశాలకు తరలించి వాటి సంరక్షణ బాధ్యతలను నగరపాలక సంస్థ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని డాక్టర్‌ తెలిపారు. పశువులను యజమానులు వాళ్ల ప్రాంగణా లలోనే ఉంచుకోవాలని, వాటి ఇష్టానుసారంగా తిరిగితే తప్ప నిసరిగా వాటిని గోశాలకు తర లిస్తామని డాక్టర్‌ హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో శానిటే షన్‌ సూపర్‌ వైజర్లు, ఇన్స్‌పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️