ముగిసిన వేసవి శిక్షణ తరగతులు

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : విద్యార్థులు పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలని, విద్య ద్వారా విజయ తీరాలు అందుకోవచ్చునని లైబ్రేరియన్‌ దడాల వెంకటరమణ అన్నారు. శుక్రవారం గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలు ముగింపు సమావేశంలో వెంకటరమణ మాట్లాడారు. నెల రోజులపాటు సుమారు 60 మంది విద్యార్థులు శిక్షణా శిబిరాలకు హాజరై తమ ప్రతిభను చాటారని, పుస్తక పఠనం, వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు వంటివి నిర్వహించి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశామని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలను, పెన్నులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు సహాయ లైబ్రేరియన్‌ వనజాక్షి, తదితరులు పాల్గొన్నారు.

➡️