సూపర్‌ సిక్స్‌ పథకాలే శ్రీరామరక్ష

Apr 30,2024 21:35

ప్రజాశక్తి-రామభద్రపురం, తెర్లాం : సూపర్‌ సిక్స్‌ పథకాలే టిడిపి గెలుపునకు శ్రీరామ రక్షని ఆ పార్టీ విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి బేబినాయనతో కలిసి రామభద్రపురం మండలం మిర్తివలస, తెర్లాం మండలంలోని లింగాపురం, అంట్లవార మోదుగువలస, చిన్నయ్యపేట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అప్పలనాయుడు మాట్లాడుతూ ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రచారాల్లో ప్రజలు అభిమానం చూపిస్తున్నారని, ఇదంతా పాలకపక్షం వైసిపిపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు. సైకో జగన్‌ పాలనకు చరమగీతం పాడేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బేబినాయన మాట్లాడుతూ సుపరిపాలన టిడిపితోనే సాధ్యమని, సంపద సృష్టి చంద్రబాబుకే సాధ్యమని చెప్పారు. అంతకుముందు బేబినాయన గొల్లపేట, అప్పలరాజుపేట, ఎస్‌.సీతారాంపురం గ్రామాల్లో ప్రచారాలు చేపట్టారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు మడక తిరుపతినాయుడు, కర్రోతు తిరుపతిరావు, నర్సిపల్లి వెంకట్‌ నాయుడు, నర్సిపల్లి వెంకటేశ్వరరావు, యుగంధర్‌, శంకర్రావు, అమరాపు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట : సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ అన్నారు. మండలంలోని వెంకటరమణపేట గ్రామంలో టిడిపి ఎమ్‌పి అభ్యర్థి శ్రీభరత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం గొంప కృష్ణ మాట్లాడుతూ టిడిపి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకొన్నారు. వీటన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, ఇందుకూరి సుధారాజు, జుత్తాడ రామసత్యం పాల్గొన్నారు. వేపాడ : మండలంలోని కుంపల్లి, కెఆర్‌ పేట గ్రామాలలో టిడిపి మహిళా నాయకులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారికి, ఎమ్‌పి అభ్యర్థి ఎం. శ్రీభరత్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌.కోట నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, రాష్ట్ర టిడిపి ఎస్‌టి ్ట సభ్యులు, మాజీ ఎంపిపి దాసరి లక్ష్మి, టిడిపి మహిళా సంఘాల కమిటీ చైర్‌ పర్సన్‌ గొంప తులసి, కోళ్ల లలిత కుమారి చెల్లి ఉషా శ్రీ, జి సుధానాయుడు, కొంపల్లి, కెఆర్‌ పేట మహిళా సంఘాల కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️