సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వండి : శంబంగి

Apr 24,2024 21:15

ప్రజాశక్తి-బొబ్బిలి: ప్రజా సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. పట్టణంలోని మూడో వార్డులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా శంబంగి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పాలన సాగిస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సంక్షేమ పాలనకు మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరారు. శంబంగి, ఆయన కుమారుడు శ్రీకాంత్‌ రెండు బృందాలుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.బిజెపికి షాక్‌.. వైసిపిలో చేరిన మాజీమంత్రి పెద్దింటినియోజకవర్గంలో బిజెపికి గట్టి షాక్‌ తగిలింది. మాజీమంత్రి పెద్దింటి జగన్మోహనరావు బిజెపిని వీడి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెసు నుంచి మూడు సార్లు పోటీ చేసిన పెద్దింటి రెండు సార్లు విజయం సాధించారు. వైసిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరినా, ఎక్కువ కాలం ఉండలేదు. వైసిపిని వీడి బిజెపిలో చేరారు. పెద్దింటి, ఆయన కుమారుడు రామస్వామినాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇద్దరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు ఉన్నారు.వైసిపిలో చేరికలుమున్సిపాలిటీలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన 15 మంది యువకులు బుధవారం వైసిపి సీనియర్‌ నాయకులు సావు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సమక్షంలో వైసిపిలో చేరారు. నేడు కడుబండి ఎన్నికల ప్రచారం వేపాడ : మండలంలో వైసిపి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు వైసిపి మండల అధ్యక్షులు ఎం.జగన్నాథం తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుండి సోంపురం, జగ్గయ్యపేట, అరిగిపాలెం, ఆకులసీతంపేట, ఆతవ గ్రామాలలో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

➡️