పార్టీ పదవులకు రాజీనామా చేసిన టిడిపి క్యాడర్‌

Feb 25,2024 14:55 #TDP, #vijayamma

ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం) : నెల్లిమర్ల జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న భోగాపురం టిడిపి నాయకులు, కార్యకర్తలు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకొని బంగార్రాజుకు టికెట్‌ కేటాయించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నాయకులు కార్యకర్తలు తీర్మానం చేశారు. బంగారు రాజు ఇండిపెండెంట్‌ గా పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తానని మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యన్నారాయణ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు సహకరించబోమని తేల్చి చెప్పారు.

➡️