26వ వార్డులో టిడిపి ప్రచారం

Apr 19,2024 22:35

 ప్రజాశక్తి – పార్వతీపురం : టిడిపికి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 26వ వార్డులో టిడిపితోనే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి టిడిపి పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీదేవి, బర్నాల సీతారాం, టిడిపి కౌన్సిలర్స్‌ కోరాడ నారాయణరావు, బడే గౌరు నాయుడు, వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు గుండ్రెడ్డి రవి, మజ్జివెంకటేష్‌, టిడిపి మండల నాయకులు చుక్క లక్ష్మీనాయుడు, అక్కేన ఎల్లంనాయుడు, చుక్క పోలినాయుడు జనసేన నాయకులు చందక అనిల్‌ కుమార్‌, గోవిందమ్మ, బిజెపి నాయకులు పార్వతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️