అయ్యన్నకు టిడిపి నేతల సత్కారం

అయ్యన్నను సత్కరిస్తున్న టిడిపి నేత రత్నాకర్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కానున్న నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నర్సీపట్నంలోని ఆయ్యన్న స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సాలువతో సన్మానం చేసి బుద్ధుడు విగ్రహాన్ని బహూకరించారు. సభాపతి పదవికి అర్హులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి స్పీకర్‌ పదవిని ఇచ్చారని,ఆ పదవికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి కశింకోట మండల అధ్యక్షులు కాయల మురళి, నాయకులు కూండ్రపు అక్కునాయుడు, భీమవరం మాజీ సర్పంచ్‌ సత్తిబాబు, మేడిశెట్టి సన్యాసినాయుడు, రెడ్డి సూర్యనారాయణ, చిరికి చైతన్య, చింతి రాజునాయుడు పాల్గొన్నారు.

➡️