టిడిపివి బూటకపు హామీలు: ఎమ్మెల్యే

May 2,2024 20:56

ప్రజాశక్తి- డెంకాడ : జగన్‌ అంటేనే నమ్మకమని, టిడిపివి బూటకపు హామలని వాటిని ఎవరూ నమ్మొద్దు అని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని పెద్ద తాడివాడ పంచాయతీలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ పోటీ చేస్తున్న జనసేన నాయకులు మాధవి స్థానికం కాదని ఎన్నికల సమయంలో చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ ప్రజల కష్టసుఖాలను తెలుసుకోరని అటువంటి వారికి ఓటు వేస్తు వృధా అవుతుందని తనను ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరారు. ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్ము నాయుడు, నాయకులు పతివాడ కృష్ణవేణి, పిఎస్‌సిఎస్‌ చైర్మన్‌ వంగలి కనక సింహాచలం, ఎంపిటిసి గాదిపల్లి రమేష్‌, గాదపల్లి పెద్ద రామ్మూర్తి, కరుమజ్జి త్రినాధరావు, వెంపటాపు రమణ, గాదపిల్లి సురేష్‌, ఎమ్మెల్యే తనయుడు మణిదీప్‌ నాయుడు, ప్రదీప్‌ నాయుడు, ఎమ్‌పి బెల్లాన తనయుడు వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.భోగాపురం: నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని చాకివలస గ్రామంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పనిచేసిన హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. చాకివలస గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధిని చూసి తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కందుల రఘుబాబు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నడుపూరు శీను, రాము, పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్‌, రావాడబాబు, గరే మురళి తదితరులు పాల్గొన్నారు.వైసిపిలోకి 80 కుటుంబాలు చేరికపూసపాటిరేగ: మండలంలోని పతివాడ గ్రామం నుంచి గురువారం నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు సమక్షంలో టిడిపి, జనసేనకు చెందిన 80 కుటుంబాలు వైసిపిలో చేరాయి. జిల్లా వైసిపి కోశాధికారి కందులు రఘుబాబు, వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపి అల్లాడ రమేష్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, పతివాడ సూరిబాబు, నారాయణరావు, సత్యం, అప్పలస్వామి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.వైసిపిలోకి మాజీ సర్పంచ్‌తెర్లాం :మండలంలోని చీకటిపేట పంచాయతీ మోదుగువలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ రెడ్డి కృష్ణమూర్తి టిడిపిని వీడి, తన అనుచరులతో కలిసి వైసిపిలో చేరారు. గురువారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆయనకు పార్టీ కండువా వేసి వైసిపిలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రెడ్డి దాలినా యుడు, ఈదుబిల్లి వెంకట నాయుడు, రెడ్డి నవీన్‌, గుల్లిపిల్లి గణేష్‌, సీరపు భాస్కరరావు, రేగిడి రేగయ్య, వాస నందకు మార్‌ పాల్గొన్నారు.ఎన్ని పార్టీలొచ్చినా మళ్లీ సిఎం జగనేబొబ్బిలి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా మరోసారి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు స్పష్టంచేశారు. గురువారం పట్టణంలోని 5, 6వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు.టిడిపి మేనిఫెస్టో.. పెద్ద బూటకంబాడంగి: టిడిపి, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టో పెద్ద బూటకమని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆక్షేపించారు. గురువారం మండలం లోని రావివలస, గూడెపువలస, ఆకులకట్ట, రామచంద్ర పురం, తదితర గ్రామాల్లో కుమారుడు శంబంగి శ్రీకాంత్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కూడా చాలదన్నారు. ఈ సందర్భంగా గూడెపువలస గ్రామానికి చెందిన పలు కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరాయి. కార్యక్రమంలో వైసిపి నాయకులు బి.వెంకట్‌ నాయుడు, తెంటు మధుసూదన్‌, మరిపి శంకర్‌రావు, ఆవు సత్యనారాయణ, జెడ్‌పిటిసి పి.రామారావు, ఎంపిపి బోగి గౌరి, పాల్గొన్నారు.

➡️