జయచంద్రారెడ్డి నామినేషన్‌లో ఉద్రిక్తత

ప్రజాశక్తి – తంబళ్లపల్లి ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరసతోపు నుంచి టిడిపి, జనసేన నాయకులు అభ్యర్థి జయచంద్రరెడ్డి నియో జకవర్గంలోని ఆరు మండలాల నుంచి వందలాది వాహనాలలో ఊరేగింపుగా తంబళ్లపల్లెకు వాహనాల్లో తరలి వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు ఇఆర్‌ఒకు ఆఫీసుకు 100 మీటర్ల దూరం లో వారిని నిలుపుదల చేశారు. అభ్యర్థి మరో నలుగురికి మాత్రమే అనుమ తించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డి మొదట మధ్యాహ్నం 2.20 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయగా ఆయన సతీమణి దాసరిపల్లి కల్పన తెలుగుదేశం పార్టీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదీలా ఉండగా టిడిపి నాయకులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిం చగా పోలీసులు వారిని అడ్డుక ున్నారు. అనంతరం టిడిపి శ్రేణులు ‘పోలీసులు డౌన్‌డౌన్‌..పోలీసుల జూదం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఇఆర్‌ఒ కార్యాలయం వరకు వెళ్లాలని పట్టు బట్టారు. గురువారం ద్వారక నాథ్‌రెడ్డి అనుచరులు కార్యాలయంలోకి వెళ్తే పట్టిం చుకోని పోలీసులు తమను అడ్డుకో వడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి కార్య కర్తలను అనుమకతించకపోవంతో వారు తీవ్ర ఆగ్రహంతో రెచ్చి పోయారు. బారికే డ్లను తోయడానికి ప్రయత్నించారు. ఆగ్రహించిన పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. సహనం కోల్పోయిన కార్య కర్తలు పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటనలో ఒక రాయి ట్రైనీ డిఎస్‌పి ప్రశాంత్‌ తలకు స్వల గాయమైంది. పోలీ సులు, టిడిపి కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలు సుకున్న నాయకులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనపై రాళ్లు రువ్విన వారిని గుర్తించి కేసు నమో దు చేస్తామని మదనపల్లి డిఎస్‌పి తెలిపారు.

➡️