వైసిపిని భూస్థాపితం చేయడమే లక్ష్యం

Apr 4,2024 21:31

ప్రజాశక్తి – భోగాపురం:  వైసిపిని వచ్చే ఎన్నికల్లో భూస్థా పితం చేయడమే లక్ష్యమని కూటమి అభ్యర్థి లోకం మాధవి అన్నారు. భోగాపురంలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం సాయ ంత్రం పలువురు వైసిపిని వీడి జనసేనలో చేరారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో ఆమె మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మాజీ జెడ్‌పిటిసి, పలువురు సర్పంచులు చేరిక ఈ కార్యక్రమంలో లోకం మాధవి ఆధ్వర్యంలో డెంకాడ మాజీ జెడ్‌పి టిసి కంది సూర్యనారాయణ, అక్కివరం సర్పంచ్‌ కంది కిరణ్‌, పూసపాటిరేగ మండలం కొప్పర్ల సర్పంచ్‌ సంకా బత్తుల సత్తి బాబు, గోవిందపురం సర్పంచ్‌ బాల రామలక్ష్మి, ఉప సర్పంచ్‌ బాల అప్పలరాజు, పూసపాటిరేగ వైసిపి యూత్‌ లీడర్‌ మహంతి శివ, భోగాపురం వార్డు మెంబర్‌ గుండపు నానాజీ, నాయకులు బాలిపల్లి సత్తిబాబుతో పాటు పలువురు చేరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు, తుమ్మి లక్ష్మీరాజ్‌ పతివాడ శ్రీనివాసరావు, జె.శివ, న్యాయవాది సుధాకర్‌, ప్రమీల, దుర్గ తదితరులు పాల్గొన్నారు. పూసపాటిరేగ: మండలంలోని లంకలపల్లి పాలెం గ్రామ పంచాయతీ నుండి వైసిపికి చెందిన పలువురు గురువారం జనసేన అభ్యర్ధి లోకం మాదవి ఆధ్వర్యంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జనసేన అధ్యక్షలు పవన్‌ కళ్యాణ్‌పై నమ్మకంతో జనసేనలో అనేకమంది చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షలు జలపారి శివ, బూర్లె విజయశంకర్‌తోపాటు పార్టీలో చేరిన రౌతు ఉపేంద్ర, నూకరాజు, గుడ్డాల రమణ, గుడ్డాల ఆదినారాయణ, గుడ్డాల రమేష్‌, రౌతు రమణ, తదితరులున్నారు.

➡️