సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే వైఖరి ప్రకటించాలి

Apr 11,2024 21:12

ప్రజాశక్తి – కొమరాడ : నియోజవర్గంతో పాటు మండలంలో దీర్ఘకాల సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి తన వైఖరితో పాటు పార్టీ వైఖరిని వెంటనే ప్రకటించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఎర్రజెండా ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మండలంలోని రాజ్యలక్ష్మి పురం, కోనవలస, డంగభద్ర గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. పూర్ణపాడు-లాబేసు వంతెన, గుమ్మిడి గెడ్డ, ఏనుగుల సమస్యపై ఎమ్మెల్యే తమ పార్టీ వైఖరిని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఎల్లవేళలా స్పందించి పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మండంగి రమణను, అరుకు పార్లమెంటు స్థానానికి ఎంపీగా పోటీ చేస్తున్న పాచిపెంట అప్పలనర్సను సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సంఘం జిల్లా కమిటీ నాయకులు హెచ్‌.రామారావు, సిపిఎం నాయకులు పి.సింహాచలం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

➡️