ఈవిఎంల కమిషనింగ్‌ పరిశీలించిన కలెక్టర్‌

గుంటూరు: ఈవిఎంల కమిషనింగ్‌ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా చేప ట్టాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. గుం టూరు తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఈవిఎంల కమిషనింగ్‌ సెం టర్‌ ఏసి కాలేజిని, అలాగే లాడ్జి సెం టర్‌లోని ఆంధ్రా లూధరన్‌ కాలే జిలో జరుగుతున్న కమిష నింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరి శీలించారు. ఒక్కో ఈవిఎం కమిషనింగ్‌కు ఎంత సమయం పడుతుంది? ఎంత మంది సిబ్బంది కేటాయించారు? తదితర వివ రాలను రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరిని అడిగి కలెక్టర్‌ తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లా డుతూ సార్వత్రిక ఎన్ని కల్లో ఈవిఎంల కమిషనింగ్‌ కీలకమని అన్నారు. కమిషనింగ్‌ చేసిన వాటిని మాక్‌ పోల్‌ చేయా లన్నారు. కమిషనింగ్‌లో సమస్య ఎదురైనా వెంటనే టెక్ని కల్‌ సిబ్బంది, మాస్టర్‌ ట్రైనర్ల దష్టికి తీసుకురావాలని తెలి పారు. ఎన్నికల ముందు రోజు తూర్పు నియోజకవర్గ పోలింగ్‌ అధికారులకు ఏసి కాలేజిలోనే ఈవిఎంలు, ఇతర పోలింగ్‌ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ జరుగు తుందని, డిస్ట్రిబ్యూషన్‌ కు సెక్టార్‌ అధికారుల వారిగా భాధ్య తలు కేటాయించాలని రిటర్నింగ్‌ అధికారికి సూచించారు. కార్యక్రమంలో పశ్చిమ రిటర్నింగ్‌ అధికారి కె.రాజ్యలక్ష్మి, అస ిస్టెంట్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగ న్నాద్‌, ఐటి నోడల్‌ అధికారి రఘు ఉన్నారు.

➡️