ఓటులో పొరపాటు-మళ్లీ అవకాశం : పల్నాడు జిల్లా కలెక్టర్‌

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : చిలకలూరిపేటలో పొలిట్‌ బాక్స్‌ ద్వారా 5వ తారీఖున ఓటు హక్కును ఉపయోగించుకున్నవారికి సార్వత్రిక ఎన్నిక అభ్యర్ది ఓటులో విషయంలో పొరపాటు జరిగిందని, ఆ ఒక్క ఓటును తిరిగి ఈ నెల 8, 9 తారీఖులలో ఉపయోగించే అవకాశాన్ని కల్పిస్తున్నామని దీనిని గమనించగలరని పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ … ఆ ఒక్క ఓటును ఈ నెల 8, 9 తారీఖులలో ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు గతంలో ఎక్కడైతే ఓటు వేశారో అక్కడే తిరిగి ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. ఈ విషయాలను ఓటును వినియోగించుకునే వారందరికీ వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా తెలియజేశా మని, పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేస్తున్నామని తప్పనిసరిగా వారి వారి ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. ఇది అధికారులు పొరబాటు అని చెప్పారు.

➡️