‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

కర్నూలు : పత్తికొండలో మంగళవారం ఉదయం ‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన జెండా ఊపి ప్రారంభించారు. పత్తికొండ మండల కేంద్రంలోని నాలుగు స్తంభాల కూడలి నుండి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు స్వీప్‌ ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు విలువ గురించి వివరించారు.

➡️