వెలుగు కార్యాలయం తలుపులు తెరిచారు.. సిబ్బంది రాలేదు..!

Feb 27,2024 10:48 #chittore, #government office

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మంగళవారం ఉదయం 10 గంటలయినప్పటికీ ఇంతవరకు వెదురుకుప్పంలోని వెలుగు కార్యాలయ తలుపులు తెరిచారు కానీ… ఇంతవరకు సిబ్బంది రాలేదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం వెలుగు కార్యాలయం ఉంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి ఆఫీసు తెరవాలి. ఇది నియమం. అయినా ఇవి ఏమి పట్టించుకోకుండా సిబ్బంది ఇష్టానుసారంగా వస్తూపోతున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, ఆ కార్యాలయ లో పనిచేస్తున్న సిబ్బంది సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మండలంలోని ఇందిర శ్రీశక్తి భవనం (వెలుగు కార్యాలయం) తలుపులు మాత్రం తెరిచారు. లోగా ఏపీఎం, ఆఫీసు రూము, కంప్యూటర్‌ గది తాళాలు తీయలేదు. ఉదయం 10:35 గంటలు అవుతున్న ఇంతవరకు సిబ్బంది ఎవరు లేరు. పై స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరబడిందా.. అని స్థానికులు మండిపడుతున్నారు.

➡️