కనుల పండువగాధ్వజారోహణం

ప్రజాశక్తి – ఒంటిమిట్ట ఒంటిమిట్టలోని పురా తన చారిత్రక ప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయం లో బుధవారం ఉదయం ధ్వజా రోహ ణంతో శ్రీరామ నవమి బ్రహ్మో త్సవాలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు మిథు నలగంలో పాంచరాత్ర ఆగమశా స్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహిం చారు. కంకణబట్టర్‌ రాజేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్ర మం జరిగింది. ఈ సందర్భంగా జెఇఒ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ధ్వజారో హణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధా నంగా ఏప్రిల్‌ 20న హనుమంత వాహనం, ఏప్రిల్‌ 22న కల్యాణో త్సవం, ఏప్రిల్‌ 23న రథోత్సవం, ఏప్రిల్‌ 25న చక్రస్నానం జరుగు తాయన్నారు. ఏప్రిల్‌ 22న సాయం త్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వ హించనున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతా మన్నారు. కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడ తామన్నారు. కంకణబట్టర్‌ రాజేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడపాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహిం చామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచావృతాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టది క్పాలకులను బ్రహ్మౌత్సవాలకు ఆహ్వానించినట్టు వివరిం చారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారా యణం చేశారు. కార్యక్రమంలో టిటిడి సిఇ నాగేశ్వరరావు, ఎస్‌ఇ జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, విజిఒ బాలిరెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరామనమి నాడు రాములోరికి టిటిడి అధికారులు వేదమంత్రాలతో పట్టు వస్త్రాలను సీతారాములకు సమర్పించారు. అనంతరం గర్భగుడిలో అధిఆకెలె ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా నవమి వేడుకలు ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరా మనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏకశిలపై వెలసిన సీతారామ, లక్ష్మణలను యాత్రికులు వేకువజాము నుండే దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తులను వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన పూలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను తిరుమాడ వీధిలో ఊరేగించారు.కల్యాణోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జెఇఒ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిబ్రహోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 22న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్బంగా భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లను టిటిడి జెఇఒ వీరబ్రహ్మంపరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో జెఇఒ చర్చించారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. శేషవాహనంపై దర్శనమిచ్చిన కోదండరాముడు శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు. భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ నిర్వ హించారు. ఆలయ మాడ వీధుల్లో కేరళ వాయిద్యాలు, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలా టాలతో స్వామి వారిని కీర్తి స్తుండగా మంగళ వాయి ద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరి గింది. భక్తులు అడుగడగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

➡️