సంక్షేమ పథకాల ఘనత మాదే

May 9,2024 21:11

ప్రజాశక్తి – తెర్లాం : సంక్షేమ పథకాలు సక్రమంగా అందించిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. మండలంలోని డి.గదబ వలస, గోపాలవలస, జగన్నాథవలస, మాదంబట ్లవలస, కాగం, మోదుగువలస, పాములువలస, చుక్కవలస, వి.చిన్నయ్యపేట గ్రామాల్లో గురువారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాను గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు ఎం.బాబ్జీరావు, వైస్‌ ఎంపిపి సత్యనారాయణ, వావిలిపల్లి ఆదినారాయణ, బి.శేషగిరిరావు, జెడ్‌పిటిసి జి.రామారావు, ఎంపిటిసి, సర్పంచులు జి.వెంకట్రావు, బోను అప్పల నాయుడు, వైస్‌ ఎంపిపి అప్పలరాజు, మాజీ ఎంపిటిసి శివాజీరాజు, తదితరులు పాల్గొన్నారు.

వైసిపిలో చేరికలు

బొబ్బిలి : మండలంలోని పెంట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సోదరుడు శంబంగి వేణుగోపాలనాయుడు కండువాలు వేసి ఆహ్వానించారు.అమకాంలో వైసిపి ప్రచారండెంకాడ: మండలంలోని అమకాంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా, బెల్లాన చంద్రశేఖర్‌ను ఎమ్‌పిగా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యఎకమంలో యువ కెరటాలు జోనల్‌ ఇంచార్జి ఐటీ వింగ్‌ బడ్డుకొండ మణిదీప్‌ నాయుడు, బడ్డు కొండ ప్రదీప్‌నాయుడు, ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మునాయుడు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

మొయిదలో ఎంపి, ఎమ్మెల్యే ప్రచారం

నెల్లిమర్ల : మండలంలోని మొయిద విజయరాంపురంలో ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ సురేష్‌బాబు గురువారం సాయంత్రం వర్షంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు అమలు చేయని విధంగా వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి మరోసారి ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేసి వైసిపిని గెలిపిం చి జగన్‌ మోహన్‌ రెడ్డిని సిఎం చేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు చనమల్ల వెంకట రమణ, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, వైస్‌ ఎంపిపి పతివాడ సత్య నారాయణ, ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, ఎంపిటిసి పి.సంతోష్‌ బాబు, నాయకులు అట్టాడ కృష్ణ దవళ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

అయ్యనిపాత్రులు సంగం ప్రచారం

కొత్తవలస: వైసిపి అభ్యర్థుల విజయం కోసం అయ్యరక పాత్రుల సంఘం గురువారం మండలంలో పెదిరెడ్లపాలెం, పోతంపేట, రాయుడుపేట, బక్కునాయుడుపేట తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. విశాఖ ఎమ్‌పి అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎస్‌కోట నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాస రావు విజయమే లక్ష్యంగా తామంతా ప్రచారం చేస్తున్నా మన్నారు. ప్రచారంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్లు పిఎస్‌ఎన్‌ పాత్రుడు, లెంక రామన్న పాత్రుడు, వైస్‌ ఎంపిపి కర్రి శ్రీను, ఎంపిటిసి లెంక వరహాలు, కొత్తవలస ప్రాంతీయ సంఘం అద్యక్షులు పి. సూరిబాబు, లెంక వెంకన్న పాత్రుడు, బెహరా విష్ణు, పి.అప్పారావు, మాజీ వైస్‌ సర్పంచ్‌ పి.వెంకట సత్యనారాయణ, వార్డు సభ్యుడు రాజేష్‌, పెదిరెడ్లపాలెం నాయకులు ఎల్‌.వరహాలు, రమణ, రమణాజీ, ధత్తి, నాగేశ్వరరావు, అప్పలకొండపాల్గొన్నారు.

➡️