లారీ బోల్తాపడి ఇద్దరికి గాయాలు

జీలుగుమిల్లి (ఏలూరు) : లారీ బోల్తాపడి ఇద్దరికి గాయాలైన ఘటన శుక్రవారం ఏలూరులో జరిగింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం శివారు జాతీయ రహదారి పై లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

➡️