వైసిపి ఓటమే కూటమి ధ్యేయం

Apr 11,2024 20:37

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : వైసిపి ఓటమే కూటమి ధ్యేయమని నెల్లిమర్ల కూటమి అభ్యర్ధి లోకం మాధవి అన్నారు. గురువారం మండలంలోని గుంపాం, తొత్తడాం, తాళపేట, వెంపడాం గ్రామాల్లో కూటమి అభ్యర్ధి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమెతో పాటు టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, మండల పార్టీ అధ్యక్షలు మహంతి శంకరావు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కూటమి అభ్యర్ధి మాదవమ్మని గెలిపించాలని కోరారు. ప్రచారం కార్యక్రమంలో కూటమి నేతలు దంగా భూలోకా, ఆకిరి ప్రసాదరావు, పిన్నింటి సన్యాసినాయుడు, పసుపులేటి గోపి, దంతులూరి సూర్యనారాయణరాజు, పిన్నింటి శ్రీనువాసరావు, కొత్తకోట రమణ, కొత్తకోట బాలకృష్ణ, జనసేన నాయకులు పతివాడ శ్రీను, నక్కాన రమణ, శంకాభత్తుల సత్తిబాబు, మహంతి శివ, జలపారి శివ, స్మార్ట్‌ రమేష్‌, కిలారి రమేష్‌, కె.రాజారావు పాల్గొన్నారు. జనసేనలో చేరిన పేరాపురం వైసిపి నాయకులుభోగాపురం: పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామానికి చెందిన పలువురు వైసిపి నాయకులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. ఆ గ్రామానికి చెందిన రౌతు నర్సింగరావు, వార్డు మెంబర్‌ రౌతు భాస్కరరా వుతో పాటు వారి అనుచరులు గురువారం జనసేనలో పార్టీ తీర్థం పుచ్చుకు న్నారు. ముంజేరులోని జనసేన క్యాంపు కార్యాలయంలో కూటమి అభ్యర్థి లోకం మాధవి వారికి కండువాలేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ వైసిపి పాలనలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చల్లవానితోట సర్పంచ్‌ పతివాడ శ్రీనివాసరావు, బోర సతీష్‌, కొలచన రమేష్‌, శరత్‌, బోర సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️