ఆట..భవిష్యత్తుకు బాట

May 20,2024 21:10

ప్రజాశక్తి- చీపురుపల్లి : క్రీడ మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఆడపిల్ల అయినా మగ పిల్లాడైనా క్రీడలను ఆస్వాదించడం ఎంతో మేలు. గెలుపు ఓటములు ముఖ్యం కాదు పిల్లల్ని ఫిట్‌ గానూ, ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి క్రీడలు తోడ్పడతాయి. ఆటలాడితే ఆరోగ్యకరమైన మనస్సుతో పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. ఈ క్రమంలోనే చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరానికి మంచి స్పందన లబిస్తోంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు అనవసరమైన తిరుగుళ్లు తిరగకుండా ఉండేందుకు పాఠశాల పిఇటి స్వరూప్‌, కె మురళిధర్‌ ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడలలో మంచి తర్ఫీదు ఇస్తున్నారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణా శిబిరంలో చదువుకుంటున్న చిన్నారులు ఆటలతో పాటు కొత్త విషయ పరిజ్ఞాణంతో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ఆటలు వల్ల ఆరోగ్యంతో పాటు విజ్ఞాణం పెరిగి ఉన్నత లక్షణాలను అలవరుచుకుంటు న్నారు. పిల్లలో దాగి ఉండే సృజనాత్మకతను వెలికి తీసి ఉత్తమంగా తీర్చిదిద్దడంలో శిక్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉదయం, సాయంత్రం శిక్షణమే1 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా శిభిరం మే నెలాఖరు వరకు సాగుతుంది. ఈ శిక్షణా శిభిరంలో సుమారు వంద మంది వరకు పిల్లలు వివిధ ఆటలలో శిక్షణ పొందుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణను అందిస్తున్నారు. ఈ శిబిరంలో బాలురు, బాలికలు కూడా శిక్షణ పొందుతున్నారు. ప్రధానంగా కబడ్డి, వాలీబాల్‌, ఖోఖో, క్రికెట్‌, షటిల్‌ బ్యాట్‌మెంటిన్‌, అథ్లెటిక్స్‌ వంటి ఆటలలో శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమికంగా ఆటలో నియమ నిబంధనలు, మెలుకవలు, బంతిని పాసింగ్‌ చేయడం, డ్రిబ్లింగ్‌ చేయడం వంటి వాటిపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. జీవితంలో ఎదగడానికి ఇదొక పునాదిఒక్క పైసా ఖర్చు లేకుండా శిక్షణను ఇస్తున్నారు. దీని వల్ల తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్ధిక భారం లేకుండా ఉచితంగా శిక్షణ పొందుతున్నాను. జీవితంలో ఒక స్థాయికి ఎదగడానికి ఈ శిక్షణా శిభిరం తోడ్పాటవుతుంది. కబడ్డీపై పూర్తి అవగాహనతోపాటు పలు రకాలైన నైపుణ్యాలపై పట్టు సాధిస్తున్నాను. వేసవి సెలవుల్లో ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాను.లాస్య, పదో తరగతి విద్యార్ధిని, చీపురుపల్లిక్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యంక్రికెట్‌ ఆటలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసిన శిక్షణ శిభిరంలో పాల్గొని శిక్షణ పొందుతున్నాను. క్రికెట్‌లో మెలకవులతో పాటు నైపుణ్యం పైన అవగాహన పొందుతున్నాను. శిక్షణా శిభిరం నా భవిష్యత్‌కి ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను.అశ్విని, ఏడవ తరగతి విద్యార్ధినివిద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే..బాల్యం నుంచే విద్యార్ధులకు ఆటల పట్ల అవగాహన ఉండాలి. అందుకోసం తల్లి దండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సాహించాలి. ఏటా చాలా మంది పిల్లలకు వేసవి శిక్షణా శిభిరాల్లో శిక్షణను అందిస్తున్నాం. వేసవి శిభిరానికి వచ్చిన వారిలో వారియొక్క నైపుణ్యాన్ని గుర్తించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నాం. వారి నైపుణ్యాన్ని బట్టి వారిని ఆయా ఆటలవైపు వెల్లేందుకు శిక్షణను అందిస్తున్నాం. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే విదంగా వారిని తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. శిక్షణా శిబిరాల ద్వారా శిక్షణ పొందిన చాలా మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలలో పాల్గొంటున్నారు. ఆటలతో పాటు వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందుతున్నాయి. పిఇటి స్వరూప్‌

➡️