హామీల అమలు ఘనత మాదే : శంబంగి

Apr 13,2024 21:30

ప్రజాశక్తి-బొబ్బిలి : గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత తమదేనని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. మున్సిపాలిటీలోని అప్పయ్యపేటలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయం చేసిన వైసిపికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు శంబంగి శ్రీకాంత్‌, సోదరుడు శంబంగి వేణుగోపాల్‌ మూడు బృందాలుగా ఇంటిం టికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కొత్తవలస : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ చేరాలంటే మళ్లీ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎమ్మెల్యే కబుడండి శ్రీనివాసరావు కోరారు. శనివారం మండలంలో కొత్తవలస-202 కాలనీ, దెందేరు, గనిశెట్టిపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. పేదల పక్షాన నిలిచిన వైసిపికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి బొంతల వెంకటరావు, మేలాస్త్రీ అప్పారావు, కొత్తవలస, గనిశెట్టిపాలెం, చినరావుపల్లి సర్పంచులు రామస్వామి, జామి ఈశ్వరరావు, బుసల దేముడు, పిఎస్‌ఎన్‌ పాత్రుడు, మాధవరావు, విరోతి కొండలరావు, ఎంపిటిసి వెలగల వెంకటరమణ, బి.ఎ.నాయుడు, లెంక వెంకన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు చీపురుపల్లి: సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృధ్ధిని చూసి ఓటు వేయాలని వైసిపి మండల అద్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్‌పిటిసి మీసాల వరహాలనాయుడులు ప్రజలను కోరారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌లు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అలజంగి సర్పంచ్‌ రఘుమండ త్రినాధరావు, పేరిపి సర్పంచ్‌ కోరా పృధ్వి, కోరాడ నారాయణరావు, కరణం చిన్నంనాయుడు, రేవల్ల సత్యన్నారాయణ, ముల్లు ఈశ్వరరావు, బవిరి రవి, రాము, మహలక్ష్మనాయుడు, మంగరాజు, సోసల్‌ మీడియా కన్వీనర్‌ మొండేటి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.పూసపాటిరేగలో వైసిపి ఎన్నికల ప్రచారం పూసపాటిరేగ : మరోసారి అవకాశం ఇవ్వాలని నెల్లిమర్ల వైసిపి ఎమ్యెల్యే అభ్యర్ధి బడ్డకొండ అప్పలనాయుడు, జిల్లా వైసిపి కోశాధికారి కందులు రఘుబాబు, చిన్నశ్రీను సోల్జర్స్‌ అధ్యక్షలు సిరి సహశ్ర కోరారు. శనివారం పూసపాటిరేగలో వైసిపి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వారు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్యాన్‌ గుర్తుపై ఓటువేసి ఎమ్మెల్యే తనను, ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ను, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మొహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనువాసరావు, ఎన్‌. సత్యనారాయ రాజు, నాయకులు మహంతి జనార్ధనరావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ మహంతి లక్ష్మణరావు, సర్పంచి టొంపల సీతారాం, బొల్లు రమేష్‌, దాడిశెట్టి త్రినాదరావు తదితరులు పాల్గొన్నారు.

➡️