పేద వాడు మరింత పేదవాడయ్యాడు

Apr 10,2024 22:10

ప్రజాశక్తి- డెంకాడ: వైసిపి పాలనలో పేదవాడు మరింత పేదవాడయ్యాడని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని నాతవలస, సింగవరం పంచాయతీలలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి పనిచ ేస్తున్న మహిళల దగ్గరికి వెళ్లి ముచ్చటిం చారు. అనంతరం టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజుతో కలిసి గడప గడపకూ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డికి పబ్లిసిటీ పిచ్చెక్కువని అందుకే అన్ని చోట్లా ఆయన స్టిక్కర్లు పెట్టుకుని పాలిస్తున్నాడని విమర్శించారు. వైసిపి పాలనలో పంచాయతీలు అభివృద్ధి చెందలేదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బడు కొండ అప్పలనాయుడు అభివృద్ధి ఏమైనా చేశాడా అని మహిళలని ప్రశ్నించారు? అభివృద్ధి చేయకపోగా చెరువులు, భూములు, కొండలను కబ్జాలు చేసి ఉన్నది మొత్తం దోచుకు తింటు న్నాడని ఆరోపించారు. తనకు ఒకసారి అవకాశ మిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మహంతి చిన్నంనా యుడు, కంది చంద్రశేఖర రావు, పతివాడ అప్పల నారాయణ, పల్లె భాస్కర్‌రావు, కలిదిండి పాణిరాజు, పతివాడ శివరామ విద్య సాగర్‌ నాయుడు, కాగితాల సత్యనారా యణ రెడ్డి, జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజినల్‌ కోఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మి, చింతపల్లి రామ్మూర్తి, మహంతి నర సింహనాయుడు, కంది సూర్యనారాయణ, పైలా శంకర్‌, శ్రీనివాస్‌, రామ్‌, లక్ష్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️