పేదింట విరిసిన విద్యా కుసుమం

మల్లారపు కీర్తి

ఎపిఆర్‌ఎస్‌ ప్రవేశపరీక్షలో కీర్తికి స్టేట్‌ ఫస్ట్‌ర్యాంకు

ప్రజాశక్తి- కె.కోటపాడు : పేదింట విద్యా కుసుమం విరిసింది. గ్రామీణ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ, చదువులో మిన్నగా రాణిస్తూ, ఐదవ తరగతి ప్రవేశాలకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎపిఆర్‌ఎస్‌ 2024 ప్రవేశపరీక్షల్లో నూటికి 99 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలోనే మొదటి ర్యాంక్‌ సాధించిన విద్యార్థిని మల్లారపు కీర్తి సత్తా చాటింది. మండలంలోని పెండ్రంగి పాఠశాల విద్యార్థులు ఇదొక్కటే కాకుండా మరో ఏడు ఉత్తమ ర్యాంకులను సాధించారు. ఎపిఆర్‌ఎస్‌ 2024 ప్రవేశపరీక్షలో పెండ్రంగి పాఠశాలకు చెందిన మల్లారపు కీర్తి స్టేట్‌ ఫస్ట్‌ర్యాంకు సాధించింది. ఇదే పాఠశాలకు చెందిన జె.మంజుల ఎపిబిసిడబ్ల్యుఆర్‌ ప్రవేశపరీక్షలో జిల్లాస్థాయిలో రెండవ ర్యాంక్‌ను, ఎల్‌.మోక్షశ్రీ నాలుగో ర్యాంకు, ఎం.కావ్య ఆరో ర్యాంకు, జి.ఓంకార్‌ 20వ ర్యాంకు, జి.నిహారికి 81వ ర్యాంకు, ఎం. అఖిల్‌ ఇలా ఏడుగురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి, అందరూ పెండ్రంగి పాఠశాల వైపు చూసేలా సత్తా చాటారు. పెండ్రంగి పాఠశాల కీర్తిని ఇనుమడింపజేసేలా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను గ్రామ సర్పంచ్‌ జె.రామలక్ష్మి, ఎంపిటిసి గోపి , పాఠశాల ఛైర్‌పర్సన్‌ బాదిరెడ్డి దేవి, పూర్వ హెడ్‌మాస్టర్‌ ఎన్‌.సూరిబాబు, గ్రామ పెద్దలు ఎల్‌.చంద్రరావు , గ్రామ యువత జె.శ్రీను, ఎస్‌.ప్రసాద్‌, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. దుశ్శాలువతో సత్కరించారు . మొట్టమొదటిగా మన గ్రామం నుంచి ఇలాంటి ఘనత సాధించిడానికి కారణమైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.బంగారునాయుడు, టీచర్‌ పి.రమేష్‌లను గ్రామ సర్పంచ్‌, పెద్దలు సత్కరించి అభినందించారుపిల్లలు ఇలాంటి అద్భుతమైన విజయం సాధించడానికి ప్రస్తుత ఉపాధ్యాయులతో పాటు గతంలో గ్రామంలో పనిచేసిన పూర్వ హెడ్మాస్టర్‌ ఎన్‌.సూరిబాబు(రాజు) వేసిన పునాది కూడా కారణమని గ్రామ పెద్దలతో పాటు, పిల్లల తల్లిదండ్రులు, ప్రస్తుత ఉపాధ్యాయులు కొనియాడారు

స్టేట్‌ ఫస్ట్‌ర్యాంకర్‌ కీర్తికి ఆర్థిక నజరానా

రాష్ట్రస్థాయిలో ఎపిఆర్‌ఎస్‌ ప్రవేశపరీక్షలో మొదటి ర్యాంక్‌ సాధించిన విద్యార్థిని ఎమ్‌.కీర్తి కుటుంబానికి పూర్వ హెచ్‌ఎం సూరిబాబు తన వంతుగా రూ.15వేలు ఆర్థిక సాయం అందించి ప్రోత్సాహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనప్పటికీ, పిల్లలను ఉత్తమంగా చదివిస్తున్న కీర్తి తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఇఒలు కె.సత్యనారాయణ, డివిడి ప్రసాద్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె.అశోక్‌ కుమార్‌, ఆర్‌.సురేష్‌ (యుటిఎఫ్‌), పోతల నాయుడుబాబు. ప్రవీణ్‌ (పిఆర్‌టియు), ఎస్‌.శ్రీను, బోకం లలితప్రసాద్‌ (ఎపిటిఎఫ్‌) హాజరై అభినందించారు.

స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ కీర్తి, ఇతర విద్యార్థులను అభినందిస్తున్న గ్రామ పెద్దలు

➡️