పేదల సంక్షేమమే థ్యేయం : కరణం

ప్రజాశక్తి-చీరాల : పేదల సంక్షేమమే ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి థ్యేయమని వైసిపి చీరాల నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో నెహ్రూ కూరగాయల మార్కెట్‌ మరియు ఫ్రూట్‌ మార్కెట్‌ల్లో వైసిపి బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి నందిగం సురేష్‌ సోదరుడు సోదరుడు నందిగం వెంకట్‌తో కలసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు, మహిళలను కలసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్‌ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజల ఇబ్బందులను కల్లారా చూసిన జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభ్యున్నతి కోసం నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు. సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా పేదల సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన ఘనత సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దక్కుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా తనను, బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా నందిగం సురేష్‌ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి అధ్యక్షుడు కొండ్రు బాబ్జీ, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు,వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌ బాబు, వాసిమల్ల బ్రదర్స్‌, బొనిగల అమతరావు, కలవకూరి యానాదిరావు, క్లస్టర్‌-2 యువత అధ్యక్షుడు రమేష్‌, గోలి జగదీష్‌, సేవదళ్‌ సెక్రటరీ గోలి గంగాధర్‌, మల్లెల లలిత రాజశేఖర్‌, జనరల్‌ సెక్రటరీ చిలుకోటి శ్రీనివాసరావు, తలకాయల సుధీర్‌, కోడూరి ప్రసాద్‌రెడ్డి, జంగా ప్రేమ్‌కుమార్‌, కట్టా చంద్ర, పిడతల అభిషేక్‌, కొండ్రు ప్రతాప్‌, తొట్టెంపూడి ఇనయ్య, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️