రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

ప్రజాశక్తి – కడప ప్రతినిధిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రూ.13.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశావో చెప్పాలని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఎర్రగుంట్లలోని ఎకెఆర్‌ కల్యాణ మండపంలో ఎన్‌డిఎ ఎన్నికల ప్రచారసభ, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత కేంద్రం పంపిణీ చేస్తున్న ఐదు కిలోల ఉచిత రేషన్‌బియ్యంను నిలిపేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 58 వేల కోట్లతో ఎన్‌హెచ్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా మాఫియా రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, మైన్స్‌ మాఫియాలు రాజ్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయని, భవిష్యత్‌లో ఒకే దేశం..ఒకేఎన్నిక నిర్వహణ కోసం పాటు పడతామని తెలిపారు. రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే పట్టాలకే పరిమితం చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేనతో కూడిన ఎన్‌డిఎ సర్కారు రాబోతోందనే విశ్వాసం ఉందని తెలిపారు. అంతకుముందు జమ్మలమడుగు బిజెపి అసెంబ్లీ అభ్యర్థి సి.ఆదినారాయణరెడ్డి, టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థి సి.భూపేష్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శశి భూషణ్‌రెడ్డి, యల్లారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎన్నికలు జరుగు తున్నాయని, భవిష్యత్‌లో ఒకే దేశం..ఒకేఎన్నిక నిర్వహణ కోసం పాటు పడతామని తెలిపారు. రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే పట్టాలకే పరిమితం చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేనతో కూడిన ఎన్‌డిఎ సర్కారు రాబోతోందనే విశ్వాసం ఉందని తెలిపారు. అంతకుముందు జమ్మలమడుగు బిజెపి అసెంబ్లీ అభ్యర్థి సి.ఆదినారాయణరెడ్డి, టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థి సి.భూపేష్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శశి భూషణ్‌రెడ్డి, యల్లారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️