నన్ను ఓడించడానికి మూడు తోడేళ్లు

Apr 23,2024 22:03

చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే

ప్రస్తుత ఎన్నికలు ప్రతి ఇంటి భవిష్యత్తుగా భావించాలి

సిద్ధం సభలో వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ :  ‘తనను ఓడించడానికి ఒకరు కాదు.. ఇద్దరు కాదు… టిడిపి, జనసేన, బిజెపి వంటి మూడు తోడేళ్లు కూటమిగా ఏర్పడ్డాయి’ అని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. వీరికి పలు పత్రికలు, టీవీ ఛానళ్లు తోడయ్యాయని విమర్శించారు. చంద్రబాబు వెనకాల ఓ కాంగ్రెస్‌ కూడా ఉందన్నారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలు ప్రచారం చేయడానికి పెత్తందారు ముఠాలున్నాయని అన్నారు. నా ఒక్కడి మీదకు ఇంతమంది ఏకం అవుతున్నారని అన్నారు. జగన్‌ కనుక ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. మంగళవారం విజయనగరంలోని చెల్లూరు వద్ద నిర్వహించిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. గడిచిన 58 నెలల తన పాలనలో ప్రతివారికీ మేలు చేశామని అన్నారు. పేదల కలల్ని, బతుకుల్ని బలిపెట్టేందుకే చంద్రబాబు చంద్రముఖిగా మారి ఏర్పాటు చేసిందే ఈ రాజకీయ కూటమే అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పేదలకు స్కీములేవీ పెట్టలేదని, ప్రభుత్వ ధనం దోచుకునే స్కామ్‌లు మాత్రమే పెట్టారని విమర్శించారు. ఇంటింటి అభివద్ధిని కొనసాగించాలన్న పోరాటం తాము చేస్తుంటే, పేదలను ఓడించాలన్న ఆరాటంతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రస్తుత ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే మాత్రమే కాదని, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్‌ను, పిల్లల భవిష్యత్‌ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవడానికి జరిగేవిగా గుర్తించాలని అన్నారు. వైసిపి ప్రభుత్వ అవసరాన్ని గుర్తించిన ప్రజలు, అడ్డుతగులుతున్న పెత్తందార్లుకు, ఆ కౌరవ సైన్యం, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి సిద్ధం.. సిద్ధం… సిద్ధం…. అంటూ అడుగులు వేస్తున్నారని అన్నారు.

నన్ను ఓడించడానికి మూడు తోడేళ్లుచంద్రబాబు హయాంలో అన్నీ స్కాములేప్రస్తుత ఎన్నికలు ప్రతి ఇంటి భవిష్యత్తుగా భావించాలిసిద్ధం సభలో వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డిప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ ‘తనను ఓడించడానికి ఒకరు కాదు.. ఇద్దరు కాదు… టిడిపి, జనసేన, బిజెపి వంటి మూడు తోడేళ్లు కూటమిగా ఏర్పడ్డాయి’ అని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. వీరికి పలు పత్రికలు, టీవీ ఛానళ్లు తోడయ్యాయని విమర్శించారు. చంద్రబాబు వెనకాల ఓ కాంగ్రెస్‌ కూడా ఉందన్నారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలు ప్రచారం చేయడానికి పెత్తందారు ముఠాలున్నాయని అన్నారు. నా ఒక్కడి మీదకు ఇంతమంది ఏకం అవుతున్నారని అన్నారు. జగన్‌ కనుక ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. మంగళవారం విజయనగరంలోని చెల్లూరు వద్ద నిర్వహించిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. గడిచిన 58 నెలల తన పాలనలో ప్రతివారికీ మేలు చేశామని అన్నారు. పేదల కలల్ని, బతుకుల్ని బలిపెట్టేందుకే చంద్రబాబు చంద్రముఖిగా మారి ఏర్పాటు చేసిందే ఈ రాజకీయ కూటమే అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పేదలకు స్కీములేవీ పెట్టలేదని, ప్రభుత్వ ధనం దోచుకునే స్కామ్‌లు మాత్రమే పెట్టారని విమర్శించారు. ఇంటింటి అభివద్ధిని కొనసాగించాలన్న పోరాటం తాము చేస్తుంటే, పేదలను ఓడించాలన్న ఆరాటంతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రస్తుత ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే మాత్రమే కాదని, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్‌ను, పిల్లల భవిష్యత్‌ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవడానికి జరిగేవిగా గుర్తించాలని అన్నారు. వైసిపి ప్రభుత్వ అవసరాన్ని గుర్తించిన ప్రజలు, అడ్డుతగులుతున్న పెత్తందార్లుకు, ఆ కౌరవ సైన్యం, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి సిద్ధం.. సిద్ధం… సిద్ధం…. అంటూ అడుగులు వేస్తున్నారని అన్నారు. విజయనగరం సిద్ధం సభ ఒక మహా సముద్రాన్ని గుర్తుచేస్తోందన్నారు. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు, శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైనట్టుగా అనిపిస్తోందన్నారు. సభలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి విశాఖ ఎంపి అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి చినవెంకటప్పలనాయుడు, గొర్లె కిరణ్‌కుమార్‌, తలే రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేసిన జగన్‌ పూసపాటిరేగ : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సుయాత్ర మంగళవారం రాత్రి పూసపాటిరేగ చేరుకుంది. మండలంలోని కొప్పెర్ల జాతీయ రహదారి వద్ద వచ్చిన జగన్‌ ప్రజలకు అభివాదం చేశారు. మండలంలోని వేలాదిగా కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలివచ్చారు. బస్సు పై జగన్‌ తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, నాయకులు కందుల రఘుబాబు తదితరులు ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు ఎంపిపి మహంతి కళ్యాణి, జెడ్‌పిటిసి సభ్యురాలు మహంతి సీతాలక్ష్మి, నాయకులు మహంతి జనార్దన్‌ రావు, పుప్పాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

విజయనగరం సిద్ధం సభ ఒక మహా సముద్రాన్ని గుర్తుచేస్తోందన్నారు. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు, శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైనట్టుగా అనిపిస్తోందన్నారు. సభలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి విశాఖ ఎంపి అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి చినవెంకటప్పలనాయుడు, గొర్లె కిరణ్‌కుమార్‌, తలే రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేసిన జగన్‌ పూసపాటిరేగ : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సుయాత్ర మంగళవారం రాత్రి పూసపాటిరేగ చేరుకుంది. మండలంలోని కొప్పెర్ల జాతీయ రహదారి వద్ద వచ్చిన జగన్‌ ప్రజలకు అభివాదం చేశారు. మండలంలోని వేలాదిగా కార్యకర్తలు నాయకులు అభిమానులు తరలివచ్చారు. బస్సు పై జగన్‌ తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, నాయకులు కందుల రఘుబాబు తదితరులు ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు ఎంపిపి మహంతి కళ్యాణి, జెడ్‌పిటిసి సభ్యురాలు మహంతి సీతాలక్ష్మి, నాయకులు మహంతి జనార్దన్‌ రావు, పుప్పాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

➡️