అట్టహాసంగా క్రీడలు ప్రారంభం

అట్టహాసంగా క్రీడలు ప్రారంభం

అట్టహాసంగా క్రీడలు ప్రారంభంప్రజాశక్తి- నారాయణవనం: నారాయణవనం మండలం కసిమిట్ట సచివాలయ పరిధిలో ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను నారాయణవనం కసిమిట్ట పాఠశాల ప్రాంగణంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కిరణ్‌ మంగళ వారం అట్టహాసంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జడ్పిటిసి కోనేటి సుమన్‌ కుమార్‌ మాట్లాడుతూ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టింద న్నారు. ఈ పోటీల వల్ల యువతలో అంతర్గతంగా దాగి ఉన్న క్రీడ ప్రతిభను వెలికి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడ రంగంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. గ్రామీణ క్రీడా కారులు వారి సత్తాను సాటి మండలానికి గుర్తింపు తీసుకు రావాలన్నారు. ఇప్పటికే క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాలను ప్రతి సచివాలయానికి పంపిణీ చేశామని తెలిపారు. అంతకుముందు క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాలను సర్పంచులు పంపిణీ చేశారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, బ్యాడ్మింటన్‌ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి 17 టీములు పాల్గొన్నట్లు పంచాయతీ సెక్రెటరీ కిరణ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఎంఈఓ ప్రభాకర్‌ రాజు, గోవిందస్వామి, మండల కన్వీనర్‌ సొరకాయలు, హెచ్‌ఎం శశికళ, సులోచన, ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌ మురుగేష్‌, అయ్యప్ప, పిటి మాస్టర్‌ సురేష్‌, పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓజిలి : గ్రామీణ యువ క్రీడాకారులు తమ నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలని వైసిపి నాయకులు పిండుకూరు మధుసూదన్‌ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మాచవరం సచివాలయంలో ‘ఆడుదాం ఆంధ్ర’ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభిం చారన్నారు. ఈ కార్యక్రమంలో మాచవరం సర్పంచ్‌ పిండు కూరు మౌనిక రెడ్డి, కుందాం సర్పంచ్‌ ఎద్దుల కనక దుర్గ భవాని, ముమ్మాయిపాలెం సర్పంచ్‌ శంకు సుజాత, తిరుమలపూడి సర్పంచ్‌ యాకసిరి గోపాలయ్య, పంచాయతీ కార్యదర్శి పెద్ద మస్తానయ్య, పిఈటిలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️