రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండిప్రజాశక్తి – గూడూరు టౌన్‌ సౌత్‌ కోస్ట్‌ రైల్వే డివిజన్‌ ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ విజయవాడ డివిజన్‌ జనరల్‌ సెక్రటరీ శంకర్రావు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం చాలా రంగాల్లో వెనుకబడి ఉందని, రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై దష్టి సారించాలని సూచించారు . ఉద్యోగుల నియామకం దేశవ్యాప్తంగా ఒకే విధంగా జరుగుతున్నాయని, ఆ విధానం కాకుండా రాష్ట్రాల వారీగా క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు . కొత్త రైళ్లను మంజూరు చేయాలని, అదేవిధంగా కొత్తగా రైల్వే మార్గాలను నిర్మించాలని, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ కేంద్రంగా ప్రధాన నగరాలకు వందే భారత రైళ్లను నడపాలన్నారు.

➡️