‘అ’ శాఖమంత్రి సహకరంతోనే దుకాణ లైసెన్సులా? స్థానికుల బ్రతుకు జీవనంపై అధికారుల పరిహాసంఅధికారపార్టీ వారికి దాసోహమంటున్న అటవీశాఖ

'అ' శాఖమంత్రి సహకరంతోనే దుకాణ లైసెన్సులా? స్థానికుల బ్రతుకు జీవనంపై అధికారుల పరిహాసంఅధికారపార్టీ వారికి దాసోహమంటున్న అటవీశాఖ

‘అ’ శాఖమంత్రి సహకరంతోనే దుకాణ లైసెన్సులా? స్థానికుల బ్రతుకు జీవనంపై అధికారుల పరిహాసంఅధికారపార్టీ వారికి దాసోహమంటున్న అటవీశాఖ ప్రజాశక్తి-తిరుపతి (మంగళం): తిరుమల కొండనే నమ్ముకోని జీవనం సాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు కల్పించే సౌకర్యాల అవసరాలకు వారి బతుకు జీవన స్థానాన్ని ఓ చోటు నుండి మరో చోటుకు మార్చుతున్నా శ్రీవారి యాత్రికుల పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి నేడు అధికార పార్టీకి చెందిన వారు వారి పరపతిని ఉపయోగించి తీసుకొస్తున్న అధర్మ లైసెన్సుల కారణంగా కాలినడక 7వ మైలు వద్ద దుకాణదారులు తీవ్రఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తాజాగా 30మందికి అటవీశాఖ భూపరిధిలో దుకాణాలను నిర్వహించుకునేందుకు అనుమతులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సర్వత్రా తీవ్రవిమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులను కాదని స్థానికేతరులకు దుకాణాలను నిర్వహించుకునేందుకు అనుమతులు ఎలా ఇస్తారని స్థానిక దుకాణాల నిర్వహకులు మీడియాతో వాపోయారు. దుకాణాల కేటాయింపుల వెనుక జిల్లాలోని ‘అ’ శాఖమంత్రి అండదండలతోనే సాగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా ‘అ’ శాఖమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ‘కారాం’ హస్తం ఉన్నట్లుగా విమర్శలు ఉన్నాయి. ఇంకేం ‘అ’ శాఖమంత్రి, ఆ ‘కారం’లే తలిస్తే జరిగిందా ఉందా. అర్హులుగా ఉన్న తిరుమల స్థానికులను కాదని వారనుకున్న వారికి దుకాణాలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చేశారు. వన్యప్రాణి రక్షణ భాద్యత ఎవరిది? తిరుమల కాలినడక మార్గంలో దశాబ్దాలుగా ఎన్నడూలేని విధంగా శ్రీవారి భక్తులపై చిరుత పులులు దాడి చేసి చంపే ఘటనలు జరిగాయి. ఈ సంఘటన యావత్‌ ప్రపంచమంతా ఉన్న శ్రీవారి భక్తులను, యాత్రికులను, ఇటు స్థానికులను, టీటీడిని కలవరపాటుకు గురిచేసింది. చిరుతల నుండి శ్రీవారి భక్తులను రక్షించేందుకు టీటీడి ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర రెడ్డి కాలినడక భక్తులను గుంపులుగా వెళ్ళమనడం, చేతికి కర్రలివ్వడం చేశారు. మరో వైపు అటవీశాఖ అధికారులు 7వ మైలు ప్రాంతంలో సంచరిస్తున్న పులులను ట్రాప్‌ కెమెరాల సహయంతో గుర్తించి ఆయా ప్రదేశాల్లో బోన్లు ఏర్పాటు చేసి పట్టుకుని సురక్షిత దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టేవారు. ఈ క్రమంలో వన్యప్రాణుల నుండి శ్రీవారి భక్తుల శాశ్వతరక్షణ కోసం వైల్డ్‌ లైఫ్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వారు అలిపిరి కాలినడక మార్గాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అప్పట్లో కాలినడక మార్గంలో జింకలకు భక్తులు మెట్లమార్గంలో విక్రయించే తినుబండారాలు వేస్తున్నారని, వాటి మిగులు ఆహారాన్ని వెతుక్కుంటూ చిన్నపాటి జంతువులు వస్తున్నాయని, వాటి కోసం చిరుతలు రావడం జరుగుతోందని అటవీశాఖ జిల్లా అధికారి సతీష్‌రెడ్డి మీడియాకు తెలిపారు. చిరుతల దాడి ఉత్కంఠ కోనసాగుతున్న రోజుల్లో చిరు వ్యాపారులు ఎవ్వరూ తినుబండారాలు విక్రయించరాదని ఇటు టీటీడి, అటవీ శాఖ సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు కూడా, మరి తాజాగా 30 మందికి దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చిన దానిలో తినుబండాలు అమ్ముకోవచ్చని ఎలా అనుమతులు జారీ చేసారో అధికారులకే తెలియాలి. ఇప్పుడు అటవీశాఖ ఫ్రదాన కర్వవ్యాలలో ఒకటైన వన్యప్రాణి రక్షణ ఎవరిది..?.శాశ్వత పరిష్కారం చూపకనే… తిరుమల కాలినడక మార్గంలో చిరుతలు, ఎలుగుబంటిలతో పాటు వన్య ఆధారిత ప్రాణులు సంచరిస్తున్న నేపధ్యంలో శ్రీవారి భక్తుల రక్షణకు ఎటువంటి శాశ్వత పరిష్కారం చూపకనే అటవీశాఖ అధికారులు ఇలాంటి దుకాణాల మంజూరు చేశారన్న ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. అసలే వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతున్న పరిస్థితుల్లో అటవీశాఖ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని స్థానిక దుకాణ దారులు వాపోతున్నారు. భారిగా లావాదేవీలతోనే 30 దుకాణాలకు అనుమతులు వచ్చాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విమర్శల నేపధ్యంలో ‘అ’ శాఖమంత్రి, అటవీశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

➡️