‘ఆడుదాం ఆంధ్ర’ పోస్టర్లు ఆవిష్కరణ

'ఆడుదాం ఆంధ్ర' పోస్టర్లు ఆవిష్కరణ

‘ఆడుదాం ఆంధ్ర’ పోస్టర్లు ఆవిష్కరణప్రజాశక్తి- తిరుపతి సిటీ:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆడుదాం ఆంధ్ర పోస్టర్లు తిరుపతి జిల్లా క్రీడాధికారి సయ్యద్‌ సాహెబ్‌, ఒలంపిక్‌ అసోసియేషన్‌ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎలమంచిలి ప్రవీణ్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. స్థానిక శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడల్ని ప్రోత్సహించేందుకు, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వరకు అన్ని క్రీడల్ని నిర్వహించేందుకు, ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ క్రీడల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్రానికి, దేశానికి అందించనున్నారని తెలిపారు. అలాగే తిరుపతిలో క్రీడాభివద్ధికి ఒక స్టేడియంను కూడా ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఒలంపిక్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్‌.శ్రీధర్‌, కోశాధికారి సాయికుమార్‌, టైక్వాండ స్టేషన్‌ కార్యదర్శి పి.విజరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️